APTET Notification in telugu language
హైదరాబాద్: విద్యాశాఖ త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రకటనను జారీ చేయనుంది. ఆ తర్వాతే డీఎస్సీ-2013 ప్రకటన వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టెట్, డీఎస్సీ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. టెట్‌కు జులై 15 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆగస్టు 25న పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన 8న (సోమవారం) జారీ చేయనున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికార వర్గాలు జులై 4న తెలిపాయి. డీఎస్సీ రాతపరీక్షలు అక్టోబరు 9 నుంచి 11 వరకు జరగనున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉన్నందున డీఎస్సీ ప్రకటన జారీకి మరికొంత సమయం పట్టనుంది. మంగళవారం రాత్రే రాతపరీక్షల వివరాలు ప్రకటించినందున ఎన్నికల నియమావళి అడ్డు రాదని సంబంధిత వర్గాలు తెలిపాయి. టెట్ అర్హత పరీక్ష మాత్రమేనన్న విషయాన్ని గుర్తుచేశాయి.
source: eenadu